NTR: విజయవాడ గవర్నర్‌పేట పోలీస్ స్టేషన్లో సీఐ బి. బాలమురళీకృష్ణ ఆధ్వర్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు యజమానులతో సమావేశం జరిగింది. బస్సులను రోడ్లపై ఎక్కడపడితే అక్కడ పార్కింగ్ చేయవద్దని, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, అధిక ఛార్జీలు వసూలు చేయరాదని సూచించారు.