ATP: వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లిలో మాజీ ఎంపీ, కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రైతు సమస్యలు, నియోజకవర్గ రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతంపై చర్చించారు. పార్టీ కోసం రంగయ్య చేస్తున్న కృషిని జగన్ అభినందించారు.