VSP: మహానాడు సందర్బంగా విశాఖ జీవీఎంసీ 32వ వార్డులో నేరెళ్ల కోనేరు జంషన్లోని ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి వార్డు నాయకులు, కార్యకర్తలు పూలమాలల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వార్డు మాజీ కార్పొరేటర్ బండారు శ్రీనివాసరావు, వార్డు అధ్యక్షుడు దాసరి దుర్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.