TG: మేడ్చల్, కొండాపూర్, నాగోల్ ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. ఆన్లైన్ ఫీజుకు అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు తెలుసుకున్నారు. ధ్రువపత్రాల మంజూరులో దళారుల పాత్రను ఏసీబీ గుర్తించింది. కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయం వద్ద 150 ప్రింటెడ్ ఆర్సీలు, డీఎల్లు.. నాగోల్ కార్యాలయంలో ఏజెంట్ల వద్ద రూ.2.41 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.