MDK: ఏడుపాయల వన దుర్గా భవాని అమ్మవారిని మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ దంపతులు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని, దేవస్థాన అభివృద్ధికి ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఇందులో అధికారులు, నేతలు పాల్గొన్నారు.