AP: ముస్లిం సోదరులకు YCP అధినేత, మాజీ సీఎం జగన్.. బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ‘త్యాగాల పండుగ బక్రీద్. త్యాగం, సహనం ఇవి రెండూ బక్రీద్ పండుగ ఇచ్చే సందేశాలు. దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ బక్రీద్ పండుగ జరుపుకుంటాం. త్యాగ నిరతికి ఈ పండుగ నిదర్శనం. అల్లాహ్ ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలి’ అని తన విషెష్లో జగన్ పేర్కొన్నారు.