BPT: వేటపాలెం మండలం సంతరవూరు రైల్వే గేట్‌ను తాత్కాలికంగా మూసివేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. అత్యవసర రైల్వే ట్రాక్ మరమ్మతు పనుల నేపథ్యంలో వేటపాలెం సమీపంలోని ఎల్సీ గేట్ నెంబర్ 237 (సంతరవూరు గేట్)ను ఈ నెల 28వ తేదీ ఉదయం 7 గంటల నుంచి జూన్ 6వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు.