TG: టీ-ఫైబర్ ప్రాజెక్టుపై కేంద్రమంత్రి జ్యోతిరాదిత్యతో సీఎం రేవంత్ చర్చించారు. పలు కీలక అంశాలను కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మండలం నుంచి గ్రామ పంచాయతీ రింగ్ నెట్వర్క్ ఆస్తులను డిజిటల్ భారత్ నిధికి బదిలీ చేసేందుకు స్పష్టమైన విధానం ఏర్పాటు చేయడంపై సీఎం ప్రస్తావించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సింధియా.. అన్నివిధాలుగా సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.