విజయనగరం సర్కిల్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ఏపీఈపీడీసీఎల్ ఎస్ఈ ఎం. లక్ష్మణరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అధిక ఉష్ణోగ్రతలు, ఈదురుగాలులు, వర్షాల కారణంగా విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతున్న నేపథ్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. టోల్ ఫ్రీ 1912 లేదా 9490610102, 9490610103 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.