NTR: విజయవాడ ఇంద్రకీలాద్రి దేవస్థానం ఘాట్ రోడ్డుకు అత్యవసర మరమ్మతులు చేపడుతున్న నేపథ్యంలో అధికారులు ప్రధాన ద్వారాన్ని తాత్కాలికంగా మూసివేశారు. భక్తులు, ప్రయాణికులు సహకరించాలని దేవస్థానం అధికారులు విజ్ఞప్తి చేశారు. మరమ్మతుల పనులు పూర్తయ్యే వరకు ఘాట్ రోడ్డులో వాహనాల రాకపోకలు నిలిపివేయనున్నట్లు తెలిపారు.