MDK: జిల్లా పోలీస్ కార్యాలయంలో బందోబస్త్ విధులకు హాజరైన పోలీసు సిబ్బందికి అదనపు ఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ప్రత్యేక బ్రీఫింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి సిబ్బంది తమకు కేటాయించిన డ్యూటీ పాయింట్లలో సమయానికి హాజరై అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. బక్రీద్ నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శాంతిభద్రతలను అమలు చేయాలన్నారు.