TPT: తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు తడ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పాత వాహనాల యజమానులకు నోటీసులు ఇవ్వాలని, రహదారి ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం బీవీ పాలెం చెక్‌పోస్ట్‌ను పరిశీలించి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.