TG: పేదల ఆలోచనలు, సూచనలకు అనుగుణంగానే యుద్ధ ప్రాతిపదికన ఇళ్లు నిర్మిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఒక్క రూపాయి ఫీజు కూడా తీసుకోకుండా మహిళల పేరుమీద రిజిస్ట్రేషన్ చేస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇళ్ల పంపిణీ జరుగుతుందని చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చాక ఒక్కో నియోజకవర్గానికి 3,500కు పైగా ఇళ్లు ఇచ్చినట్లు వెల్లడించారు. రెండో విడతలో 2వేల ఇళ్లు కేటాయిస్తామన్నారు.