AP: విదేశాల నుంచి వచ్చేవారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లా కలెక్టరేట్లలో మైగ్రేషన్ మేనేజ్మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. కలెక్టరేట్లో MRO స్థాయి అధికారి నేతృత్వంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. AP NRT సొసైటీతో సమన్వయం చేస్తూ ఈ జిల్లాస్థాయి సెల్ పనిచేయనుంది.