AP: రాబోయే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇస్తామని మంత్రి నారా లోకేష్ చేసిన ప్రకటనపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సంతోషం వ్యక్తం చేశారు. ఇది చరిత్రాత్మక నిర్ణయమని అన్నారు. దీంతో దేశంలో అందరికన్నా ముందుగా మహిళలకు అత్యంత గౌరవం ఇచ్చే పార్టీగా TDP గుర్తించబడిందన్నారు. ఈ చరిత్రాత్మక నిర్ణయాన్ని ప్రకటించిన నారా లోకేష్, CM చంద్రబాబుకు రఘురామ కృతజ్ఞతలు తెలిపారు.