KRNL: మంత్రాలయం మండలం మాధవరం హౌసింగ్ లేఔట్‌ను జిల్లా కలెక్టర్ ఏ.సిరి బుధవారం పరిశీలించారు. ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులు రోడ్డు సమస్యను వివరించగా త్వరలోనే రోడ్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి, బిల్లులు సకాలంలో చెల్లించాలని అధికారులకు సూచించారు.