SDPT: రైతులు ఎవరు అధైర్య పడవద్దని, ప్రభుత్వం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తుందని చిన్నకోడూరు , నంగునూరు ఏఎంసీ ఛైర్మన్లు మహేందర్, యాదగిరి పేర్కొన్నారు. చిన్నకోడూరులో బుధవారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను బీఆర్ఎస్ నాయకులు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రాజేష్, జయంత్ పాల్గొన్నారు.