SRPT: అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ రైతులకు భరోసా ఇచ్చారు. ఈరోజు ఎస్పీ నరసింహతో కలిసి ఆత్మకూరు (ఎస్) మండలంలో కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లును తనిఖీ చేశారు. లారీల కొరత, అన్లోడింగ్ ఆలస్యంపై చర్యలు తీసుకుంటామన్నారు. తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ మిల్లులకు తరలిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.