MDK: నార్సింగి మండలంలో వర్షానికి తడిసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించేందుకు అధికారులు, పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎన్హెచ్-44పై పోలీసుల సాయంతో లారీలు ఏర్పాటు చేసి నార్సింగి, సంకాపూర్, శేరిపల్లి, జప్తీసూర్ కేంద్రాల నుండి తడిసిన ధాన్యాన్ని తరలించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తహసీల్దార్ గ్రేసీబాయి తెలిపారు.