KKD: తుని మండలంలోని ప్రసిద్ధ శ్రీ తలుపులమ్మ అమ్మవారి దేవస్థానంలో బుధవారం హుండీ లెక్కింపు జరిగింది. గత 58 రోజుల హుండీ ఆదాయం రూ. 54,44,339 లక్షలుగా నమోదైందని దేవస్థానం ఈవో పెన్మెత్స విశ్వనాధ రాజు వెల్లడించారు. ఇందులో నగదు రూపంలో రూ. 50,98,031, నాణేల రూపంలో రూ.3,46,308 లభించాయన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.