GNTR: తెనాలి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో చిన్నారావూరు డొంక రోడ్డులో డీసిల్టింగ్ పనులు కొనసాగుతున్నాయి. వర్షాకాలంలో మురుగునీటి ప్రవాహం సాఫీగా సాగేందుకు కాలువల శుభ్రపరిచే పనులను వేగవంతం చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు సహకరించాలని మున్సిపల్ అధికారులు కోరారు.