SRD: జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళా ఉత్సవాల్లో భాగంగా ‘పోష్’ చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళలకు సురక్షితమైన పని వాతావరణం కల్పించడం ప్రతి సంస్థ బాధ్యత అని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి కార్యాలయంలో ఐసీసీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మహిళలు నిర్భయంగా ‘షీ-బాక్స్’ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.