ఐపీఎల్ తొలి క్వాలిఫయర్‌లో GTను ఓడించి RCBఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసిన RCB పేసర్ భువనేశ్వర్ తమ జట్టు విజయంలో ‘డేటా’ పాత్రను వివరించాడు. తాము డేటా ఆధారంగా ప్రణాళికలు రచిస్తామని, అయితే వంద శాతం దానిపైనే ఆధారపడమని చెప్పాడు. బ్యాటర్లకు అవకాశం ఇవ్వకుండా ఎల్బీడబ్ల్యూ, క్లీన్‌బౌల్డ్ చేయడమే తమ బౌలింగ్ వ్యూహమని భువీ పేర్కొన్నాడు.