ATP: మహిళలు, చిన్నారుల భద్రతకు జిల్లాలో ఢోకా లేదని, ప్రభుత్వం, పోలీసుశాఖ అండగా ఉంటాయని జిల్లా ఎస్పీ పి.జగదీష్ తెలిపారు. గార్లదిన్నె మండల కేంద్రంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. అత్యవసర సహాయం కోసం శక్తి యాప్, స్త్రీ రక్ష పోర్టల్ ఉపయోగించుకోవాలన్నారు. గంజాయి సమాచారం కోసం 1972 టోల్ ఫ్రీ నంబరుకు తెలపాలన్నారు.