TPT: ఎలక్షన్ మ్యాపింగ్ ప్రక్రియను పక్కాగా నిర్వహించాలని తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్ అధికారులకు సూచించారు. బుధవారం RC పురం (M) కమ్మకండ్రిగ హెచ్ఐడబ్ల్యూలో బీఎల్వోలు నిర్వహిస్తున్న గృహ మ్యాపింగ్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. 2002 ఓటరు జాబితాను 2025 జాబితాతో అనుసంధానం చేసే సమయంలో ప్రతి ఇంటికి వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించాలని ఆదేశించారు.