HNK: శాంతియుత వాతావరణంలో పండుగలను ప్రజలు ఆనందంగా జరుపుకోవాలని సెంట్రల్ జోన్ డీసీపీ కవిత అన్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా బుధవారం వరంగల్ కమిషనరేట్ కార్యాలయంలో మతపెద్దలతో పీస్ కమిటీ మీటింగ్‌ను నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రశాంతంగా పండుగను జరుపుకోవాలని డీసీపీ సూచించారు.