MDK: అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొంటామని, రైతులు పుకార్లు నమ్మవద్దని మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్ భరోసా ఇచ్చారు. నర్సాపూర్ తుల్జారంపేట్లో తడిసిన ధాన్యాన్ని ఆమె పరిశీలించారు. జిల్లాలో తడిసిన 400 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని బాయిల్డ్ మిల్లులకు తరలిస్తున్నామని, ఇప్పటికే 250 టన్నులు తరలించి రైతులకు న్యాయం చేశామని కలెక్టర్ తెలిపారు.