SKLM: కంచిలి మండలం కర్తలి గ్రామంలో బుధవారం ఎంఈఓ శివరాం ప్రసాద్ ఆధ్వర్యంలో ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య, యూనిఫాం, పుస్తకాలు, మధ్యాహ్న భోజనం అందుతాయని, ప్రైవేటుకు ధీటుగా ప్రమాణాలు పెంచుతున్నామని ఎంఈవో తెలిపారు. పిల్లల భవిష్యత్తుకు ప్రభుత్వ బడులే సరైన వేదికని, పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలన్నారు.