VSP: గత కొద్ది రోజులుగా ఎల్నినో ప్రభావంతో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగినట్లు పర్యవేక్షక ఇంజనీర్ జి. శ్యాంబాబు తెలిపారు. వినియోగదారులకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా అందించేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. విశాఖ సర్కిల్ కార్యాలయంలో ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ 1912ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.