KDP: బద్వేల్ రూరల్ సర్కిల్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన ఇద్దరికి కోర్టు 30 రోజుల కఠిన జైలు శిక్ష విధించింది. బి.కోడూరు పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న ఇద్దరిని పట్టుకుని కేసులు నమోదు చేశారు. బద్వేల్ 2 క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ఇద్దరినీ జైలుకు తరలించాలని ఆదేశించింది.