RR: మాదినాగుడలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘ఆదిత్య బ్లడ్ సెంటర్’ను పీఏసీ ఛైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రమాదాలు, ప్రసవాలు, అలాగే తలసేమియా చిన్నారుల ప్రాణాలు కాపాడటంలో రక్తం పాత్ర కీలకమన్నారు. రక్తదానంపై యువత భయపడకుండా ముందుకు రావాలని పిలుపునిస్తూ, రక్తదాతలకు ప్రశంసా పత్రాలను అందజేశారు.