AP: తిరుమల వేంకటేశ్వరునికి భక్తులు భారీ విరాళాలు అందజేశారు. శ్రీనివాసునికి చెన్నైకి చెందిన గోపాలకృష్ణ, పురుషోత్తం అనే ఇద్దరు భక్తులు 4.5 కిలోల బంగారు నక్షత్ర హారతులను అందజేశారు. మైసూరుకు చెందిన మరో భక్తుడు రూ.1.10 కోట్ల విలువైన 5 బంగారు పతకాలను టీటీడీకి అందజేశాడు.