MNCL: విద్యార్థులు కష్టపడితేనే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని మంత్రి వివేక్ అన్నారు. బుధవారం మందమర్రిలోని ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉత్తమ ఫలితాలను సాధించిన ఆయన విద్యార్థులను సన్మానించారు. ఇదే స్ఫూర్తితో విద్యార్థులు ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో మందమర్రి మున్సిపల్ కమిషనర్ రాజలింగం, ఎంఈవో రాథోడ్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.