SDPT: సోషల్ మీడియాలో వస్తున్న నకిలీ ఆన్లైన్ షాపింగ్ ప్రకటనలపై అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ DSP జి.శ్రీనివాసు హెచ్చరించారు. ‘జాగ్రత్త! భారీ డిస్కౌంట్ల పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. పేమెంట్ ముందు వెబ్సైట్లను పరిశీలించండి. OTPలు, బ్యాంక్ వివరాలు పంచుకోవద్దు’ అంటూ తెలిపారు. మోసాలకు గురైతే వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు.