NTR: విజయవాడ ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డును మరమ్మత్తుల నేపథ్యంలో గురువారం నుంచి తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఈవో శీనా నాయక్ తెలిపారు. భక్తుల రాకపోకల కోసం శ్రీ కనకదుర్గ నగర్ వైపు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఉచిత బ్యాటరీ వాహనాలు, అదనపు సెక్యూరిటీ, ప్రత్యేక దర్శన పాయింట్లు ఏర్పాటు చేశామన్నారు.