KMM: వడ్లు, మక్కలు కొనుగోలులో తీవ్ర జాప్యం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ ఖమ్మం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆవుల అశోక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం రామ నరసయ్య విజ్ఞాన కేంద్రంలో సమావేశమై మాట్లాడారు. పంటలకు సరైన ధరలు లేక ప్రభుత్వం దగా చేస్తోందని మండిపడ్డారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట నేలపాలు అవుతుందన్నారు.