GDWL: రాజోలి మండలంలో బుధవారం తెల్లవారుజాము నుంచి కురిసిన భారీ వర్షంతో రైతులు ఆనందంగా పొలాల బాట పట్టారు. నేల పదును పడటంతో విత్తనాలు వేయడానికి రైతులు పరుగులు తీశారు. వరి, పత్తి, మిరప విత్తనాలు వేస్తున్నట్లు తెలిపారు. సకాలంలో వర్షాలు కురవడంతో ఈ ఏడాది పంటలు బాగా పండుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.