NLR: సంగం – కొరిమెర్ల రహదారి సమీపంలో రోడ్డు ప్రమాదాల నివారణకు ఎస్సై భోజ్యా నాయక్ బుధవారం చర్యలు చేపట్టారు. ఇటీవల హోల్డాన్ మలుపు వద్ద ప్రమాదాలు జరుగుతుండటంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. రేడియం స్టిక్కర్లతో ఉన్న డ్రమ్ములు ఏర్పాటు చేశారు. వాహనదారులు వేగ నియంత్రణ పాటించాలన్నారు. ప్రయాణికులు తప్పనిసరిగా రోడ్డు నియమ నిబంధనలు పాటించాలని తెలిపారు.