SDPT: బెజ్జంకి మండల కేంద్రానికి చెందిన రొడ్డ ప్రమీల విద్యారంగంలో మరో మైలురాయిని చేరుకున్నారు. మధ్యప్రదేశ్‌లోని శ్రీకృష్ణ యూనివర్సిటీలో “ఆటోమొబైల్ రంగంలో విదేశీ పెట్టుబడులు” అంశంపై పరిశోధన చేసి పీహెచ్డీ పట్టా అందుకున్నారు. ప్రస్తుతం ఆమె సిద్దిపేట డిగ్రీ కళాశాలలో కామర్స్ లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. పలువురు విద్యావేత్తలు, స్నేహితులు అభినందించారు.