MBNR: జడ్చర్ల నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ పరిధిలో డబుల్ ఓట్ల దుర్వినియోగంపై వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఒకే వ్యక్తికి రెండు ఓట్లు ఉండకుండా సమగ్ర విచారణ చేపట్టి అర్హత లేని ఓట్లను తొలగించాలని బుధవారం జిల్లా అడిషనల్ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఎన్నికల వ్యవస్థ పారదర్శకంగానే ఉండాలని కోరారు.