కాకినాడ జిల్లాలో మహిళల భద్రత, సంక్షేమం కోసం కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పిఠాపురం, కాకినాడ నగరాల్లో వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ ఏర్పాటు చేయనున్నట్లు ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ తెలిపారు. ‘సఖి నివాస్’ పథకం కింద తొలి దశలో రెండు హాస్టల్స్‌కు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి హాస్టల్లో 30 మంది మహిళలకు వసతి, భద్రత కల్పిస్తారన్నారు.