కోనసీమ: రావులపాలెం శ్రీకృష్ణదేవరాయ కాపు కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్న మహానాడు వేడుకల్లో అమలాపురం ఎంపీ గంటి హరీష్ బాలయోగి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మహానాడు ఏర్పాట్లను పరిశీలించారు.