SS: మంగళగిరి మహానాడులో ‘కార్యకర్తే అధినేత’ తీర్మానంపై మంత్రి ఎస్.సవిత మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ సామాన్య కార్యకర్తలను సైతం నాయకులుగా, మంత్రులుగా తీర్చిదిద్దిన పొలిటికల్ యూనివర్సిటీ అని కొనియాడారు. పార్టీ కోసం శ్రమించే వారికి లోకేశ్ అగ్రతాంబూలం ఇస్తున్నారని చెప్పారు. దేశంలోనే తొలిసారిగా కార్యకర్తలకు రూ.5 లక్షల బీమా కల్పించిన ఘనత టీడీపీదేనన్నారు.