JGL: రాయికల్ పట్టణ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. రాయికల్ మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం బుధవారం జరిగింది. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు సమస్యలపై కౌన్సిలర్లు ఎమ్మెల్యే, చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు.