AP: రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రేపు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించింది. రేపు 119 మండలాల్లో తీవ్ర వడగాలులు, 155 మండలాల్లో వడగాలులు.. ఎల్లుండి 52 మండలాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది.