KNR: ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని, ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని మానకొండూర్ ఎమ్మెల్యే, డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కోరారు. కరీంనగర్ నగర పాలక సంస్థ 7వ డివిజన్ పరిధిలోని సదాశివపల్లి గ్రామంలో మహిళ సంఘాల సభ్యులకు చీరలు, గ్రామానికి చెందిన ఏడుగురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన అందజేశారు.