గుంటూరును సుందరంగా, సురక్షితంగా తీర్చిదిద్దాలని జీఎంసీ కమిషనర్ కే. మయూర్ అశోక్‌తో కలిసి కలెక్టర్ సాయి కాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. బుధవారం నగరంలోని కూడళ్లు, రహదారులను పరిశీలించిన ఆయన.. అనంతరం జరిగిన సమీక్షలో మాట్లాడారు. కొత్తగా రోడ్డు వేసిన తర్వాత రెండేళ్ల వరకు ఎలాంటి తవ్వకాలకు అనుమతి ఉండదని కలెక్టర్ స్పష్టం చేశారు.