MDK: నాలుగున్నర తులాల బంగారు ఆభరణాలు బ్యాగులో పెట్టుకొని RTC బస్సు ఎక్కగా రామాయంపేట ఆర్టీసీ బస్టాండ్లో తన బ్యాగ్ నుంచి బంగారం వస్తువులు చోరీ అయినట్లు రాజన్న SRCL జిల్లాకు చెందిన దేవలక్ష్మి తెలిపారు. ఇవాళ అక్కన్నపేటలోని తమ బంధువుల ఇంట్లో జరిగిన పండగకు వచ్చి తిరిగి వెళుతుండగా ఈ ఘటన జరిగిందని బాధితురాలు వాపోయింది. పోలీసులు కేసు నమోద చేసి దర్యాప్తు చేస్తున్నారు.