BDK: జిల్లా క్యాంప్ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్నను నూతనంగా ఎన్నికైన జూలూరుపాడు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మాలోత్ మంగీలాల్ నాయక్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెను శాలువాతో సన్మానించి, స్వీట్లు అందజేశారు. మండలంలో పార్టీ బలోపేతంతో పాటు ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరేలా పనిచేయాలని దేవి ప్రసన్న ఆయనకు సూచించారు.