AKP: జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హాను నూతనంగా బాధ్యతలు చేపట్టిన చీడికాడ ఎస్సై డీ.లక్ష్మీనారాయణ, బుచ్చయ్యపేట ఎస్సై పీ.మనోజ్ కుమార్ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్ఐలను ఎస్పీ అభినందించారు. శాంతిభద్రతల పరిరక్షణ, అక్రమ కార్యకలాపాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎస్పీ సూచించారు. బాధితులకు త్వరితగతిన న్యాయం చేయాలని చెప్పారు.